ట్రంప్‌ను టార్గెట్ చేసిన కేఏ పాల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతోంది.ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారా.

లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.గంట గంటకు పరిణామాలు మారిపోతుండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా మారింది.

అమెరికా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్‌కు.

మరికొన్ని రాష్ట్రాల్లో బిడెన్ కు ఆధిక్యం వస్తుండటంతో చివరకు ఎవరు గెలుస్తారనేది ఇప్పడు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

తామే గెలుస్తానని, సంబరాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు.కానీ తామే గెలుస్తామని బిడెన్ చెబుతున్నారు.

ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరిగ్గా జరగడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బిడెన్ వర్గం తాము కూడా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.

అయితే ఈ క్రమంలో ట్రంప్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తాను గెలిచానంటూ ట్రంప్ ఎలా ప్రకటిస్తారని కేఏ పాల్ విమర్శించారు.

సుప్రీంకోర్టుకు వెళతానంటూ ట్రంప్ ప్రకటించడం సరికాదని కేఏ పాల్ విమర్శించారు.కాగా అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా కేఏపాల్ ప్రచారం చేశారు.

దీపావళి రోజు కరెన్సీ నోట్లను కాల్చేసిన వ్యక్తి.. వీడియో వైరల్‌..