కె ఏ పాల్ ను చేరదీస్తున్న వైసిపి ?

గత కొన్ని రోజులుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్( KA Paul ) జగన్ కు అనుకూలం గా ప్రతిపక్షాలపై ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు .

ఒకప్పుడు జగన్ పై( CM Jagan ) అంతెత్తున లెగిసిన పాల్ ఇప్పుడు పల్లెత్తు మాట అనకపోవడం వెనక తెరవెనుక మారిన సమీకరణాలే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో షర్మిల వర్గం తమకు దూరమవుతుందని అంచనా తో ఉన్న వైసిపి బ్రదర్ అనిల్ క్రైస్తవ వర్గంలో తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారేమో అని వైసీపీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఒకప్పుడు బ్రదర్ అనిల్( Brother Anil ) పరపతి ని క్రైస్తవ వర్గం లో పెంచడం కోసమే కేఏ పాల్ ను వైఎస్ ఇబ్బంది పెట్టారని అంటూ ఉంటారు.

అనిల్ ఎదుగుదల కోసమే కేఏపాల్ వనరులను పై కాంగ్రెస్ దృష్టి పెట్టి వాటిని నియంత్రించినది అని వార్తలు వచ్చాయి.

అయితే మారుతున్న పరిస్థితులు నడుమ తమ సంప్రదాయ క్రైస్తవ ఓటు బ్యాంకు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే అది పాల్ వల్ల సాధ్యమని నమ్ముతున్న వైసిపి( YCP ) ఆయనను ఆకర్షించిందని చెబుతారు.

రాజకీయంగా ఆయనకు ఏ విధమైన మైలేజ్ లేకపోయినప్పటికీ క్రైస్తవ జనాభాలో మాత్రం ఇప్పటికీ ఆయనకు పట్టు ఉందని బావిస్తున్న వైసిపి """/" / అది తమకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అంచనాలతోనే ఆయనను చేరవేసినట్లుగా తెలుస్తుంది.

దానికి తగ్గట్టు గానే గత కొన్ని రోజులుగా రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలపై కేఏ పాల్ ప్రతిపక్ష వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

తన సహజ శైలి కి భిన్నంగా ఆయన గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.

అయితే వైసిపి ఆశిస్తున్నట్లుగా క్రైస్తవ జనాభాను కే ఏ పాల్ ఎంత మేరకు ఆకర్శించగలరో చూడాలి.

నిర్మాతగా మారుతున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. ప్రొడ్యూసర్ గా భారీ సక్సెస్ సాధిస్తారా?