కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం..!!

ఫిబ్రవరి 2వ తారీఖు గురువారం కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించడం తెలిసిందే.

అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.కాగా ఆయన చనిపోయి 24 రోజులకు ఇప్పుడు ఆయన సతీమణి జయలక్ష్మి (86) గుండెపోటుతో మరణించడం జరిగింది.

సరిగ్గా 24 రోజుల వ్యవధిలో రెండు మరణాలు సంభవించడంతో.కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

92 సంవత్సరాల వయసులో కె.విశ్వనాధ్ మరణిస్తే.

ఆయన సతీమణి జయలక్ష్మి 86 సంవత్సరాల వయసులో మరణించారు.భర్త విశ్వనాథ్ మరణించాక జయలక్ష్మి చాలా కృంగిపోయి ఉంటూ వస్తున్నారట.

ఈ క్రమంలో ఆదివారం ఫిబ్రవరి 26వ తారీకు ఒకసారిగా ఆమెకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడవటం జరిగిందంట.

కె.విశ్వనాథ్ భార్య మరణ వార్త చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.

ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకీ  గురికావడంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికి ఆమె చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.విశ్వనాధ్ ఇరవై ఏళ్ళ వయసులో జయలక్ష్మిని వివాహం చేసుకోవడం జరిగింది.

యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక