కొత్తవాళ్లతో రాఘవేంద్రుడు సినిమా… అదే మ్యాజిక్ రిపీట్
TeluguStop.com
టాలీవుడ్ లో రొమాంటిక్ లవ్ స్టోరీలు, కమర్షియల్ ఎంటర్టైనర్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు కె.
రాఘవేంద్రరావు.టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో రాఘవేంద్రుడు కూడా ఉంటాడు.
హీరోయిన్స్ ని అందంగా చూపించాలంటే అది కేవలం రాఘవేంద్రరావుకి మాత్రమే సాధ్యం.అలాగే పాటలకి సొగసు తీసుకొచ్చిన దర్శకుడు అంటే దానికి కూడా రాఘవేంద్రరావు పేరునే వినిపిస్తుంది.
ఇలా కళాపోషకుడుగా అరుదైన ఘనత వహించిన రాఘవేంద్రరావు కమర్షియల్ జోనర్ చిత్రాల నుంచి భక్తిరస చిత్రాల వైపు దృష్టి పెట్టాడు.