కంగువా మూవీకి జ్యోతిక రివ్యూ.. భర్త సినిమా కాకపోతే ఆమె ఇలా స్పందించేవారా?
TeluguStop.com
సూర్య హీరోగా సిరుత్తై శివ డైరెక్షన్ లో తెరకెక్కిన కంగువా మూవీ( Kanguva Movie ) తాజాగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే కొంతమంది ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేయగా ఆ నెగిటివ్ కామెంట్ల గురించి, నెగిటివ్ రివ్యూల గురించి జ్యోతిక( Jyothika ) స్పందిస్తూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే కంగువా నెగిటివ్ రివ్యూల గురించి తాజాగా జ్యోతిక రియాక్ట్ అయ్యారు.కంగువా అద్భుత చిత్రం అని సూర్య( Surya ) యాక్టింగ్ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
కంగువా మూవీ మొదటి అరగంట ఆశించిన రేంజ్ లో లేదని జ్యోతిక తెలిపారు.
అదే సమయంలో సౌండ్ చాలా ఎక్కువగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఎన్నో సినిమాలలో లోపాలు ఉంటాయని ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలలో సైతం అలాంటి లోపాలు ఉండటంలో తప్పు లేదని ఆమె కామెంట్లు చేశారు.
"""/" /
మూడు గంటల సినిమాలో 30 నిమిషాల సినిమా మాత్రమే ఆశించిన విధంగా లేదని నేను నిజం చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.
ఇదొక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించిందని జ్యోతిక తెలిపారు.సూర్య గత సినిమాలలో ఇలాంటి కెమెరా వర్క్ ను ఎప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకు వస్తున్న నెగిటివ్ రివ్యూలను చూసి ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. """/" /
గతంలో రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలలో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా సీన్స్ బాలేకపోయినా ఆ సినిమాలు చూడలేదని జ్యోతిక తెలిపారు.
సినిమాను రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్టు ఉన్నారని ఆమె అన్నారు.సినిమాపై ఇంత నెగిటివిటీ చూడటం బాధగా ఉందని ఆమె తెలిపారు.
అయితే సూర్య సినిమా కాకపోతే జ్యోతిక ఈ స్థాయిలో స్పందించేవారా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ చిట్టి మేనేజర్ని చూశారా.. ఎంప్లాయిస్‌ని ఎలా ఆడుకుంటుందో..