రూ.50 కోట్ల విలువైన ఇంటిని ఎవరికో ఇచ్చేసిన జ్యోతిలక్ష్మి.. అద్దె ఇంట్లో కూతురు

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు డ్యాన్సులు చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది జ్యోతి లక్ష్మి.

( Jyothi Lakshmi ) ఈ హాట్ డ్యాన్సర్ 130 కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది.

1970వ కాలంలో మాములు పాత్రలతో పాటు పాటలకు బాగా డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది.ఈయన ఒక ట్రైన్డ్‌ డాన్సర్.

1980వ కాలంలో ఆమె చెల్లులు జయమాలిని( Jayamalini ) సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.

ఆమె పోటీకి రావడంతో జ్యోతి లక్ష్మి సినిమాలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.పర్సనల్‌గా కూడా కొన్ని సమస్యలు రావడం వల్ల ఆమె ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగలేకపోయింది.

జ్యోతి లక్ష్మి బ్లడ్ క్యాన్సర్ కారణంగా 2016లో చెన్నైలో తుది శ్వాస విడిచింది.

అప్పటికి ఆమె వయసు 67 ఏళ్లు.ఆమె కూతురు జ్యోతి మీనా( Jyothi Meena ) కూడా ఓ నటి.

తెలుగులో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది.ఫ్యామిలీ అనే తెలుగు సినిమాలో ఆమె ఒక ఐటమ్ సాంగుకు నర్తించింది.

తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది.కోలీవుడ్‌లో ఐటెం నెంబర్స్‌కు డాన్సులు చేస్తూ జ్యోతి మీనా కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

జ్యోతి మీనా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

"""/" / తమిళనాడు రాష్ట్రం, చెన్నై( Chennai ) సిటీలోని టీ నగర్ తన తల్లికి ఏడు అంతస్తుల బిల్డింగ్ ఉండేదని ఆమె చెప్పింది.

అయితే దానిని ఎవరికి ఇచ్చిందో లేదంటే అమ్మిందో తనకు తెలియదు అని షాకింగ్ కామెంట్లు చేసింది.

లోన్ కారణంగానో లేదంటే ఇంకేదైనా కారణంగానో ఆ ఖరీదైన ఇల్లు అమ్మినట్లు ఆమె తెలిపింది.

టీ నగర్( T-Nagar ) చాలా రిచ్‌ ఏరియా.అందువల్ల ఇప్పుడు అక్కడ చిన్న ఇల్లే కొన్ని లక్షల్లో పలుకుతుంది.

అలాంటిది ఏడంతస్తుల భవనం అంటే కోట్లలో ఉంటుందని చెప్పుకోవచ్చు.తన తల్లి ఎవరికో ఇచ్చేసిన ఆ ఇల్లు ఇప్పుడు రూ.

50 కోట్ల వరకు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని జ్యోతి మీనా తెలిపింది. """/" / ఇల్లు అమ్మే సమయంలో తాను చాలా చిన్న అమ్మాయినని, సరైన మెచ్యూరిటీ కూడా లేదని, అందుకే ఇల్లు ఇచ్చేటప్పుడు సంతకం చేసానని తెలిపింది.

ఒకవేళ అన్ని విషయాలు తెలిసినా తన తల్లికి ఇష్టం ఉంటే తాను అభ్యంతరం చెప్పకపోయి ఉండేదాన్ని అని తెలిపింది.

జ్యోతిలక్ష్మి తనుకు నచ్చిన పనులు చేస్తుందని, ఎవరి పర్మిషన్ కోసమో ఆమె చూడదని జ్యోతి మీనా చెప్పుకొచ్చింది.

అయితే జ్యోతి మీనా ఇప్పుడు ఆర్థికంగా ప్రస్తుతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది.ఒక రెంట్‌ హౌస్ లో తాను ఉంటున్నట్లు ఆమె ఇంటర్వ్యూలో తెలిపింది.

ఒకవేళ తన తల్లి ఆస్తులను కూతురి కోసం ఉంచినట్లయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరు…డైరెక్టర్ ఎవరో తెలుసా?