సొంత చెల్లిని కూడా నాకు తెలియదు అని చెప్పిన జ్యోతి లక్ష్మి … కారణం ఏంటి ?

జ్యోతిలక్ష్మి.1970లలో ఈమె ఒక పాపులర్ ఐటమ్ గర్ల్.

కేవలం శృంగార భరిత నృత్యాలలో నర్తించినందుకు గాను ఆమె అప్పటి యువతకు ఒక ఆరాధ్య దేవతగా వెలిగిపోయింది.

జ్యోతిలక్ష్మి తర్వాత ఎంతోమంది ఐటెం సాంగ్స్ లో నత్తించేందుకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె స్థానాన్ని భర్తీ చేయలేక పోయారు.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఆమె పాపులర్ క్లబ్ డాన్సర్ గా వందల సినిమాలో వయ్యారాలు వొలకబోసింది.

జ్యోతిలక్ష్మి స్థానాన్ని ఆమె చెల్లి జయమాలిని వచ్చేవరకు ఎవరు దక్కించు కోలేకపోయారు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

అయితే జ్యోతిలక్ష్మికి సొంత చెల్లెలు అయినా జయమాలిని రాకతో ఆమె కు సినిమాలు తగ్గుతూ వచ్చాయి.

అయితే తొలినాళ్లలో వీరిద్దరూ అక్క చెల్లెలు అనే విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు.

జ్యోతిలక్ష్మికి తన చెల్లెలు జయమాలిని అంటే నచ్చేది కాదు.ఎందుకంటే వారిద్దరూ వేరు వేరు తల్లుల దగ్గర పెరగడమే అందుకు గల కారణం.

"""/" / జ్యోతిలక్ష్మిని చిన్నతనంలోనే తన మేనత్తకు దత్తత ఇచ్చేశారు.ఎక్కడ తిరిగి తన సొంత తల్లి దగ్గరికి వెళ్లి పోతుందో అనే భయంతో ఆమె మేనత్త చెల్లెలు పైన తల్లి పైన చెడుగా చెప్పి మరీ పెంచింది.

అందుకే జయమాలిని ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఏ రోజు జ్యోతిలక్ష్మి తో మాట్లాడేది కాదు.

పైగా జ్యోతిలక్ష్మి సంపాదించిన డబ్బు అంతా కూడా ఆమె మేనత్తకి ఇచ్చేది. """/" / డబ్బులతో ఎలాంటి ఆస్తులను కూడబెట్టకుండా జల్సాలతో ఖర్చు పెట్టేది దాంతో జయమాలిని ఓవైపు ఎదుగుతుంటే జ్యోతిలక్ష్మి మరోవైపు అన్ని విషయాల్లోనూ తగ్గిపోయింది.

ఇక ఒకసారి ఇంటర్వ్యూలో తనకు జయమాలిని అంటే ఎవరో అని కూడా చెప్పేసింది జ్యోతిలక్ష్మి.

అంతలా వారి మధ్య విభేదాలు ఉండేది కానీ జ్యోతిలక్ష్మి అన్ని పోగొట్టుకొని చితికిపోయి చివరికి తన చెల్లి జయమాలిని దగ్గరికి వచ్చింది.

అప్పుడు అక్కను దగ్గరికి తీసుకొని ఆదరించింది జయమాలిని.

మహేష్ వాయిస్ వల్ల ముఫాసాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు .. సూపర్ స్టార్ రేంజ్ ఇదే!