ఆ ఫ్లైట్ నిండా ‘‘ కొకైన్ ’’.. డ్రగ్స్‌ మత్తులోనే జీ20 సమ్మిట్‌కి : ట్రూడోపై భారత మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్న సంగతి తెలిసిందే.

ట్రూడో వ్యాఖ్యలపై భారత్ మండిపడుతోంది.అంతేకాదు.

కెనడా ప్రధాని వైఖరి సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలావుండగా.

ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సూడాన్‌లో భారత మాజీ దౌత్యవేత్త దీపక్ వోహ్రా.

"""/" / కొద్దిరోజుల క్రితం జీ20 సదస్సు( G20 Summit ) నిమిత్తం భారత్‌కు వచ్చినప్పుడు ట్రూడో డ్రగ్స్ మత్తులో వున్నారంటూ ఆరోపించారు.

ట్రూడో( Trudeau ) కెనడా నుంచి వచ్చిన విమానంలో కొకైన్ వున్నట్లుగా స్నిఫర్ డాగ్స్ గుర్తించాయని.

అందుకే ఆయన రెండు రోజుల పాటు తన హోటల్ గది నుంచి బయటకు రాలేదని వోహ్రా సంచలన ఆరోపణలు చేశారు.

ఈ కారణంగానే ట్రూడో జీ20 సమావేశాలకు హాజరుకాలేకపోయారని ఆయన ఆరోపించారు.జీ న్యూస్ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ దీపక్ చౌరాసియాతో( Journalist Deepak Chaurasia ) మాట్లాడుతూ వోహ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

జస్టిన్ ట్రూడో చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తారని.ఆయనకు అంతర్జాతీయ సంబంధాల గురించి చాలా తక్కువ అవగాహన వుందని దీపక్ వోహ్రా అన్నారు.

"""/" / ఢిల్లీ విమానాశ్రయంలో( Delhi Airport ) ట్రూడోను తన భార్య నిశితంగా గమనించిందని.

ఆయన నిరుత్సాహంగా, ఒత్తిడిలో వున్నట్లుగా కనిపించారని తనతో చెప్పిందని దీపక్ తెలిపారు.డ్రగ్స్ సేవించడం వల్ల ట్రూడోకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే జీ20 లీడర్స్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కూడా గైర్హాజరయ్యారని వోహ్రా అన్నారు.

ప్రస్తుతం జస్టిన్ ట్రూడో ఒంటరివాడయ్యాడని.తన సమక్షంలో ఏ తప్పూ జరగలేదని చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని దీపక్ ఆరోపించారు.

కెనడాలో వీసా సేవలను నిలిపివేయడం వల్ల భారత్ సరైన పనిచేసిందని వోహ్రా పేర్కొన్నారు.

ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ భారత్ అని.దేశ అభ్యున్నతి కోసం ఒక స్టాండ్ తీసుకుంటామని ఇండియా చూపించిందని దీపక్ వ్యాఖ్యానించారు.

ఆ సినిమా చేయనని డైరెక్టర్ కు షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?