ఈనెల 27న సీజేఐగా జ‌స్టిస్ లలిత్ ప్ర‌మాణ‌స్వీకారం..!

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యూయూ ల‌లిత్ నియామ‌కం అయ్యారు.ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈనెల 27న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.మ‌రోవైపు సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈనెల 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

త‌న త‌ర్వాత సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ ను ఎన్వీ ర‌మ‌ణ సిఫార‌సు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర‌తో జ‌స్టిస్ ల‌లిత్ ను దేవ 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మిస్తున్న‌ట్లుగా కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కోలీవుడ్ ఇండస్ట్రీకి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన సుకుమార్… తిరుగుండదంటూ!