దళితులకో న్యాయం, ధనవంతులకో న్యాయమా…?

సూర్యాపేట జిల్లా:అది ప్రభుత్వ భూమి, అందులో కొంత రెడ్డి భూస్వాముల చేతిలో ఉండగా,కొంత దళితులు గుడిసెలు,గడ్డి వాములు వేసుకొని ఉన్నారు.

ఓ ప్రభుత్వ పాలసీని అమలు చేసే భాగంలో ఆ భూమి ప్రభుత్వానికి అవసరమైంది.

ముందుగా దళితులు నివాసం ఉంటున్న భూమిని లాగేసుకొని, భూస్వాములను వదిలేసిన అరాచక చర్య సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల పురపాలికలోని శాంతినగర్ సమీపంలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 479 లో 11.

30 ఎకరాల ప్రభుత్వ బంజారాయి భూమి కలదు.అందులో గత 30 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వాలు దళిత కాలనీ కోసం కేటాయించారు.

అందులో కొంత నల్లరాతి సారువా ఉండగా,మరికొంత భూమిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వాములు వరి సాగు చేసుకుంటున్నారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఆటోనగర్ నిర్మించేందుకు నిధులు కేటాయించి,దాని కోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

దీనితో అధికారులు శాంతినగర్ 479 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ బంజారాయి భూమిని గుర్తించారు.

ఇంత వరకూ బాగానే ఉంది.అయితే అప్పటికే ఆ భూమిలో కొంత భాగం దళితుల ఆధీనంలో ఉంది.

అందులో గుడిసెలు వేసుకోగా,మరి కొంతమంది గడ్డి వాముల ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వాముల చేతిలో ఉన్న భూమిలో వరి పంట ఉంది.

అయితే ఆటోనగర్ పేరుతో అధికారులు దళితుల గుడిసెలు, గడ్డి వాములు ఖాళీ చేయించి,అక్కడ ఉన్న మొత్తం ప్రభుత్వ బంజారాయి భూమిని గుర్తించి,హద్దులు కూడా ఏర్పాటు చేశారు.

పంట పొలాలు ఉండడంతో కోతలు పూర్తయిన తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి,భూస్వాముల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొనే విషయానికి రెవిన్యూ అధికారులు బ్రేక్ వేసి వెళ్లిపోయారు.

పంట ఉందికదా నిజమేనని నమ్మిన దళితులకు ప్రస్తుతం పొలాల కోతలు పూర్తి అయినా భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోకుండా దళితులను వెళ్లగొట్టిన భూమిలో ఆటోనగర్ నిర్మాణం పనులు వేగవంతం చేశారు.

దీనితో దళితులు తమ భూమిని ఖాళీ చేయమని చెప్పి అక్రమంగా పోలీసులతో,బలవంతంగా ఖాళీ చేయించారు.

అపుడే తమకు జరిగిన అన్యాయంపై బాధిత దళితులు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి, హుజూర్ నగర్ ఆర్టీవోకి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిని గుర్తించి ఇండ్ల స్థలాల కోసం ఇస్తామని ఎమ్మెల్యే సైదిరెడ్డి హామీ ఇచ్చినట్లుగా దళితులు చెప్తున్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న రెడ్డి సామాజిక వర్గాల భూస్వాములను వదిలేసి,నిలువ నీడలేని దళితుల గుడిసెలను తొలగించి, దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూస్వాముల వ్యవసాయ భూములను కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు,అధికారులు కుమ్మకై రాజకీయ పలుకుబడితో పక్కా స్కెచ్ తో అమలు చేశారని వాపోతున్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం భూస్వాముల చేతిలో ఏళ్ల తరబడి అక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి దళితులకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ తాసిల్దారులకు వినతి సమర్పించారు.

వాస నగేష్ బాధితు దళితుడు.గత 30 సంవత్సరాల నుండి దళితుల ఆధీనంలో ప్రభుత్వ భూమి ఉంది.

ఆటోనగర్ పేరుతో అధికారులు వచ్చారు.దళితులం అడ్డుకున్నాము.

పోలీస్ స్టేషన్ కి తరలించి అన్యాయంగా ఖాళీ చేయించారు.ఆటోనగర్ పూర్తయిన తర్వాత ఉపాధి కల్పిస్తామన్నారు.

11.30 కుంటలు గుర్తించి,దళితులను ఖాళీ చేయించి,ఆ భూమికి మాత్రమే స్తంభాలు ఏర్పాటు చేశారు.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి పట్టా ఉందని కొంత భూమిని వదిలేస్తున్నారు.

మొత్తం ప్రభుత్వ భూమిని గుర్తించాలి.నేరేడుచర్ల తాహాసిల్దార్ 30 కుంటలు అసైన్ ల్యాండ్ ఉంది.

ఆ రైతుకు గతంలో పాస్ బుక్ వచ్చింది.మిగతా భూమిని హ్యాండ్ ఓవర్ చేశాము.

అసైన్డ్ ల్యాండ్ విషయం ఉన్నతాధికారులకు నివేదించాము.మీ దరఖాస్తును కూడా కలెక్టర్ కి పంపిస్తామని దళితులకు వివరించారు.

ఆరు పాత్రల్లో ఇరగదీసిన నభా నటేష్.. స్టోరీ కూడా సూపర్ కానీ అదే మైనస్..??