ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
TeluguStop.com
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
అనంతరం సీఎం జగన్ నూతన సీజేకు శాలువా కప్పి సన్మానం చేశారు.కాగా సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్ కు చెందిన న్యాయమూర్తుల కుటుంబం.
న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025