న్యాయం,ధర్మం గెలిచింది:మంద కృష్ణ మాదిగ

నల్లగొండ జిల్లా:ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ,మాదిగ ఉప కులాలు ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశామని,ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగామని ఎట్టకేలకు న్యాయం,ధర్మం గెలిచిందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఉద్విగ్న స్వరంతో స్పందించారు.

ఈ విజయం వర్గీకరణ కోసం పోరాడి అమరులైన మాదిగ బిడ్డలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షనీయమని కృతజ్ఞతలు తెలిపారు.

రిజర్వేషన్లపై రెండో అడుగు పడబోతుందని,ఇది మాదిగల పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

మౌనం వీడిన కవిత : అదానికో న్యాయం.. ఆడ బిడ్డకో న్యాయమా ?