కేవలం ఈ మూడు ఉంటే చాలు పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది!

సాధారణంగా కొందరికి బాడీ మొత్తం సన్నగా ఉన్న పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.

దీన్నే బెల్లీ ఫ్యాట్( Belly Fat ) అంటారు.ఆడవారే కాదు పురుషుల్లో సైతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే బాన పొట్టను ఫ్లాట్ గా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ మీకు బాగా వర్కోట్ అవుతుంది.

"""/" / అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో మూడు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seed ) మిక్స్ చేసి సేవించడమే.

"""/" / నిమ్మ పండు, దాల్చిన చెక్క, చియా సీడ్స్.కేవలం ఈ మూడు ఉంటే చాలు పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది.

వీటితో పైన చెప్పిన విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకునే నిత్యం తీసుకుంటే మీ పొట్ట‌ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.

ఇమ్యూనిటీ పవర్ ను పెంచి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది.ఇక ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడంతో పాటు రెగ్యుల‌ర్ గా ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు రన్నింగ్, స్కిప్పింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయండి.

తద్వారా మీ పొట్ట కొవ్వు మరింత వేగంగా కరుగుతుంది.

రోజమ్మ నా అమ్మ.. వైరల్ అవుతున్న రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్!