కేవలం 11 నిమిషాల నడక చాలు.. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి..

మామూలుగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండడం కోసం చెమటలు పట్టేలా జిమ్లో కష్టపడవలసిన అవసరం లేదు.

గుండె జబ్బులు, స్ట్రోక్ అనేక రకాల క్యాన్సర్లు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కేవలం 11 నిమిషాల నడకచాలని ఒక కొత్త అధ్యయనంలో తెలిసింది.

అంటే వారానికి 75 నిమిషములు చురుకుగా నడవడం, డాన్స్ చేయడం, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడడం, మెట్లు ఎక్కడం వంటివి చేస్తే సరిపోతుంది.

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషంలో శరీరక శ్రమ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

రోజుకి 10 లేదా 11 నిమిషాల పాటు నడవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడరని యూకే లోనికి కేంబ్రిడ్జి విద్యాలయంలోని పరిశోధకులు బృందం వెల్లడించింది.

మీరు వారానికి 150 నిమిషముల వ్యాయామం చేయడం ఇబ్బంది అనుకుంటే 75 నిమిషములు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"""/" / ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోవడానికి కారణం గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి.

2019 సంవత్సరంలో 17.9 మిలియన్ల మంది వీటి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

2017 లో 9.6 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్రిటిష్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషములు శరీరక శ్రమ చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని 17 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

క్యాన్సర్ ఏడు శాతం తగ్గించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.అలాగే పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు 3 నుంచి 11% తక్కువ ప్రమాదం కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే నడిచేటప్పుడు చేతులు ముందుకి వెనుకకి కదిలించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

ఇలా నడుస్తూ మధ్య మధ్యలో జాగింగ్, రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఫేషియ‌ల్ హెయిర్ ను రిమూవ్ చేసే న్యాచుర‌ల్ రెమెడీస్ ఇవే!