‘సలార్’ టీజర్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ .. ఒక్క డైలాగ్ తో బ్యాక్ డ్రాప్ రివీల్!
TeluguStop.com
మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అది కూడా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న 'సలార్' మూవీ( Salaar ).
కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.
మరి ఎట్టకేలకు ఈ సినిమా నుండి ఈ రోజు ఉదయాన్నే మోస్ట్ ఏవైటెడ్ టీజర్ రిలీజ్ అయ్యింది.
ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూడగా ఆ ఎదురు చూపులు ఫలించి ఇన్నాళ్లకు టీజర్ రాగా ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
మాస్ విజువల్స్ అండ్ ఎలివేషన్ తో మరింత పవర్ఫుల్ గా ఉంది.నీల్ టీజర్ కట్ చూసిన తర్వాత ఈ సినిమా 1000 కోట్లు ఖాయం అంటున్నారు.
"""/" /
అలాగే ఫ్యాన్స్ ఈ టీజర్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ ను వెతికిపట్టుకునే పనిలో ఉన్నారు.
ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అందులో ఉన్న డైలాగ్ ద్వారా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ను కనిపెట్టేసారు.
ఇందులో 'జురాసిక్ పార్క్( Jurassic Park )' అనే పదం వినిపించగా ఇది 90'స్ లో సినిమా అని చెప్పేస్తున్నారు.
కేజిఎఫ్ 80లలో మూవీ కాబట్టి ఆ సమయంలో జురాసిక్ పార్క్ మూవీ రాలేదు.
"""/" /
ఆ మూవీ 93లో వచ్చింది.దీంతో ఈ చిన్న విషయంతో సలార్ మూవీ 1990 ల బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న మూవీ అని చెబుతున్నారు.
అలాగే ఇది కేజిఎఫ్ సిరీస్ తర్వాత దీనికి లింకప్ గా ఉంటుంది అని అంటున్నారు.
మొత్తానికి నీల్ ఈసారి సంచలనం ప్లాన్ చేస్తున్నాడు.కాగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.