ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఇద్దరు గొప్ప నాయకులే అంటూ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి బాగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

సీనియర్ ఎన్టీఆర్ 1983లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు డాక్టర్ చదువులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని హెల్త్ యూనివర్సిటీ ని పెట్టాలని అనుకున్నాడు.

ఇక 1986 లోని ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే పేరుతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇక ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మరణించగా.ఆయన ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి ఆయన గుర్తింపుగా ఆయన పేరును పెట్టారు.

అలా పాతికేళ్ల నుండి ఆ పేరు అలాగే కొనసాగింది.మధ్యలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చి వెళ్లాయి కూడా.

కానీ ఏ ఒక్కరు కూడా పేరు మార్పు గురించి అసలు చర్చలు చేయలేదు.

కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ పేరు మార్పు గురించి ఆలోచనలు చేశాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, వైయస్ఆర్సీపీ మధ్య జరుగుతున్న వాదనలు గురించి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అలా విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు తాజాగా రంగం సిద్ధమయింది.

కానీ ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.పైగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

"""/"/ కానీ ఈ విషయం గురించి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అంటూ.ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు.

ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు అంటూ.విశ్వవిద్యాలానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని.

తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు.

"""/"/ ఇక ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఏదేమైనా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కాస్త ఉపశమనం అనిపించినట్లు తెలుస్తుంది.

ఎవరు ఏమి చేసుకున్న మాకు బాధ లేదు అంటూ.విశ్వవిద్యాలయానికి అన్న పేరు లేకున్నా సరే.

మా హృదయాలలో మాత్రం ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.

"""/"/ ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పేరు మార్చేందుకు రంగం సిద్ధం కాగా.

దానికి సంబంధిత సవరణ బిల్లును శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.

అందుకే ఈ బిల్లుపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు.తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి వీరి ఫైర్ ను ఎన్టీఆర్ తన మాటలతో తగ్గించేశాడు.త్వరలోనే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం కాస్త వైయస్సార్ విశ్వవిద్యాలయంగా మారడానికి సిద్ధంగా ఉంది.

సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులపై వేటు..!!