వామ్మో.. జూనియర్ ఎన్టీఆర్ కొత్త వాచ్ ధర అన్ని కోట్లా.. కళ్లు బైర్లు కమ్మేలా?

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు స్టార్ డైరెక్టర్లు, పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు మాత్రమే దర్శకులుగా ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

తాజాగా ముంబైలో ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ను ధరించి కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు కోటీ 70 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

"""/"/కళ్లు బైర్లు కమ్మే రేటుకు తారక్ ఈ వాచ్ ను కొనుగోలు చేయడం గమనార్హం.

తారక్ కు సాధారణంగానే వాచీలంటే ఇష్టం కాగా ఈ వాచ్ విదేశాలకు చెందిన బ్రాండెడ్ వాచ్ కావడం గమనార్హం.

ఈ ఖరీదైన వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/a కాగా ఈ బ్రాండ్ కు సంబంధించిన ప్రతి వస్తువు ఖరీదైనదే అని సమాచారం.

"""/"/ గతంలో కూడా ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ తో కనిపించగా ఆ వాచ్ ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ జూన్ నెల నుంచి కొరటాల శివ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కొరకు తారక్ ప్రస్తుతం లుక్ మార్చుకునే పనిలో పడ్డారు.

కొరటాల శివ సినిమాలో స్టూడెంట్ గా కనిపించాల్సి ఉండటంతో తారక్ కొత్త లుక్ పై దృష్టి పెట్టారని బోగట్టా.

కమిషన్ కు కేసీఆర్ లేఖ… కాంగ్రెస్ ఆగ్రహం