బాహుబలి 1 సక్సెస్ కావడానికి జూనియర్ ఎన్టీఆర్ మూవీ కారణమా.. నమ్మకపోయినా షాకింగ్ నిజమిదే!
TeluguStop.com
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి 1 మూవీ( Baahubali 1 ) ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి క్లైమాక్స్ కారణమనే సంగతి తెలిసిందే.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న వల్లే బాహుబలి1 అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ట్విస్ట్ ద్వారా సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెంచడంలో రాజమౌళి( Rajamouli ) సఫలమయ్యారు.
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఈ సినిమా సక్సెస్ కావడానికి జూనియర్ ఎన్టీఆర్( NTR ) జక్కన్న కాంబో మూవీ సింహాద్రి( Simhadri ) కారణమని చాలామంది భావిస్తారు.
సింహాద్రి మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్, బాహుబలి1 క్లైమాక్స్ ట్విస్ట్ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి.
"""/" /
ఈ ట్విస్ట్ వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.
అయితే ఈ రెండు సినిమాలకు కథ అందించింది విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కాగా వసంత కోకిల అనే సినిమా నుంచి స్పూర్తి పొందానని ఆయన అన్నారు.
మూగ మనసులు సినిమా స్పూర్తితో జానకి రాముడు కథ రాశానని సింధూర పువ్వు సినిమా స్పూర్తితో సమరసింహారెడ్డి రాశానని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో వెల్లడించారు.
"""/" /
విజయేంద్ర ప్రసాద్ చాలా మందిలా నేను స్పూర్తి తీసుకోలేదని చెప్పకుండా ఏ సినిమా ఎక్కడినుంచి స్పూర్తి తీసుకున్నారో వెల్లడించడం గమనార్హం.
విజయేంద్ర ప్రసాద్ పారితోషికం కూడా భారీ లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది.
విజయేంద్ర ప్రసాద్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.విజయేంద్ర ప్రసాద్ మహేష్ జక్కన్న కాంబో మూవీకి సైతం కథ అందించారు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?