Junior Ntr Mahesh Babu : వరుస ఫ్లాపుల తర్వాత భారీ హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖ హీరోలు వీళ్లే!
TeluguStop.com
సాధారణంగా వరుసగా సినిమాలు ఫ్లాపైతే ఆ హీరో కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
వరుస ఫ్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాపులు వచ్చినా కమ్ బ్యాక్ ఇచ్చి వార్తల్లో నిలిచారు.
అలాంటి హీరోలలో మహేష్ బాబు ముందువరసలో ఉంటారు.పోకిరి తర్వాత మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి.
"""/" /
సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.
అదే సమయంలో మహేష్ బాబు దూకుడు సినిమా( Dookudu )లో నటించడం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగాయి.
మహేష్ కెరీర్ లో దూకుడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.జూనియర్ ఎన్టీఆర్ కు సైతం శక్తి సినిమా నుంచి రభస సినిమా వరకు వరుస ఫ్లాపులు షాకిచ్చాయి.
బాద్ షా మూవీ కూడా కమర్షియల్ గా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది.
"""/" /
టెంపర్ సినిమాతో హిట్ సాధిస్తానని మాటిచ్చిన తారక్ ఆ సినిమాతో సక్సెస్ సాధించారు.
సై సినిమా తర్వాత నితిక్ కు వరుస షాకులు తగలగా ఇష్క్ సినిమాతో నితిన్ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో అభిమానులకు షాకిచ్చిన ప్రభాస్ సలార్ సినిమాతో సక్సెస్ సాధించారు.
అల్లరి నరేష్ సుడిగాడు తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడగా నాంది సినిమా( Naandhi )తో ఆయన సక్సెస్ సాధించారు.
పవన్ కళ్యాణ్ సైతం ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడగా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ నటించిన పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.