Junior NTR , Devara: అప్పుడు అఖండ ఇప్పుడు దేవర.. లీకైన వీడియోతో ఎన్టీఆర్ అంచనాలను పెంచేశాడుగా!
TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) దేవర మూవీ షూటింగ్ గతేడాది మొదలు కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో లీక్ కాగా లీకైన వీడియోలో తారక్ ఊరమాస్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించేలా ఉన్నారు.


సాధారణంగా బ్లాక్ డ్రెస్ లో కనిపించడానికి సెలబ్రిటీలు ఇష్టపడరు.అయితే అఖండ సినిమాలో అఘోరా గెటప్ లో బాలయ్య బ్లాక్ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఇప్పుడు దేవర( Devara ) సినిమాకు సంబంధించిన లీకవుతున్న అప్ డేట్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు.
లీకైన వీడియోతో జూనియర్ ఎన్టీఆర్ అంచనాలను పెంచేశాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
గత ఐదేళ్లలో తారక్ నటించి విడుదలైన సినిమా ఆర్.ఆర్.
ఆర్ మాత్రమే కావడం గమనార్హం.తారక్ కెరీర్ లో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు.
"""/" /
అయితే గతంలో జరిగిన తప్పు ఇప్పుడు రిపీట్ కాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయి.
ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని ఏడాదికి కనీసం ఒక సినిమాను విడుదల చేయాలని తారక్ భావిస్తున్నారు.
వరుసగా సినిమాలను ఫిక్స్ చేసుకున్న తారక్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
వార్2 సినిమా( War2 Movie ) వచ్చే ఏడాది రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
"""/" /
తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, దేవర2 సినిమాల గురించి మాత్రం అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.
వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుండటం కూడా తారక్ కెరీర్ పై ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ మరింత బిజీ కావడం ఖాయమని చెప్పవచ్చు.
గుడ్డిదని గేలి చేశారు.. కట్ చేస్తే అంబానీతో సెల్ఫీ, మోదీతో భేటీ..!