వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ.. వాళ్లకు వార్నింగ్ ఇస్తూ?

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలయ్య( Balakrishna ) చేసిన కామెంట్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్( Jr NTR Fans ) బహిరంగ హెచ్చరిక అంటూ అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఈ లేఖలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత ఘాటుగానే స్పందించగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

"""/" / అభిమానుల కోసం తపన పడే హీరోలలో తారక్ ముందువరసలో ఉంటారని కానీ ప్రతి నిమిషం జూనియర్ ఎన్టీఆర్ అవమానాలకు గురవుతూ ఉంటే ఆయన ఫ్యాన్స్ గా మాకు గుండెల్లో నిప్పుల కొలిమిగా రగులుతోందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ అన్న సూచనల మేరకు మేము సంయమనంతో ఉన్నామని ఇప్పుడు మాత్రం సంయమనం పాటించడం అస్సలు కుదరదని యంగ్ టైగర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.

"""/" / ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ పై జరిగిన మానసిక దాడి చాలని ఇక దేవర( Devara ) అభిమానుల సత్తా వాళ్లకు తెలియాలని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.

బాలయ్య ప్రవర్తన ద్వారా తెలుగుదేశం వాళ్లు( TDP ) ఎన్టీఆర్ ను ఎంతలా ద్వేషిస్తున్నారో అర్థమైందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.

తారక్ అన్నను భారీగా టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. """/" / ఏపీ జూనియర్ ఎన్టీఆర్ అడ్డా అని చాటి చెబుతామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఈ లేఖ విషయంలో టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సి ఉంది.

బాలయ్య ఈ వివాదం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

పొలిటికల్ వర్గాల్లో ఈ వివాదం హాట్ టాపిక్ అవుతోంది.

అల్లు అర్జున్ కోసం రాని తారక్… ఎన్టీఆర్ రాకపోవడానికి అదే కారణమా?