జూనియర్ ఎన్టీయార్ వార్ 2 లో సెకండ్ హీరో గా చేస్తున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) సినిమా రాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత వార్ 2( War 2 ) సినిమాతో ఆయన బాలీవుద్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇంతకుముందు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ గురించి మనకు తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ ని 'ఆది పురుష్' సినిమా పేరుతో భారీగా దెబ్బ కొట్టారు.

"""/" / ఇక ఎన్టీఆర్ కి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురవ్వబోతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు జూనియర్ ఎన్టీఆర్ ని హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికీ ఆయన మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా తన షూటింగ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి పట్టించుకోవడం లేదు.

హృతిక్ రోషన్( Hrithik Roshan ) హీరోగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఏమాత్రం క్రేజీ దక్కుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక రీసెంట్ గా బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక 'త్రిబుల్ ఆర్'( RRR ) సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ కు ఇలాంటి అన్యాయమే జరిగింది.

మరి ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అవుతుందా లేదంటే తనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

భారతీయ విద్యార్ధుల కోసం ఇండియన్ ఎంబసీ స్పెషల్ ప్రోగ్రామ్.. ఏమిటీ ‘MARG’?