ఆరోజు కర్నూలు జిల్లాలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ కు పండగే అంటూ?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా తర్వాత మరోసారి వీరికి కాంబినేషన్లో దేవర సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
"""/" /
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కర్నూలులో( Kurnool ) నిర్వహించబోతున్నారని సమాచారం.
సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది అందుకే ఇక్కడ ఈ సినిమా వేడుకను ప్లాన్ చేయాలని మేకర్స్ నిర్వహిస్తున్నట్టు సమాచారం.
ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను( Pre-Release Event ) జరపడం కోసం ఇప్పటికే నిర్మాతలు అనుమతికి అప్లై చేశారట.
రాయలసీమలో ఎన్టీఆర్ కి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అక్కడ కనుక సినిమా వేడుకను చేసాము అంటే లక్షల కొద్ది అభిమానులు తరలివస్తారు.
ఇలా లక్షల సంఖ్యలో అభిమానులు వస్తే వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు గగనమే అని చెప్పాలి.
"""/" /
ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అనుమతి రాకపోతే ఈ వేడుకను హైదరాబాద్లోనే చేయటానికి నిర్మాతలు ముందస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని సమాచారం.
నిజానికి ఈ వేడుకను ఖమ్మంలో( Khammam ) చేయాలని ముందుగా భావించారట కానీ ఇటీవల పెద్ద ఎత్తున వరదలు రావడంతో అక్కడ సినిమా వేడుక చేయడం మంచిది కాదని భావించిన నిర్మాతలు కర్నూలు ఎంపిక చేశారని తెలుస్తోంది.
అయితే ఈ వేడుకకు పర్మిషన్ కనుక ఇస్తే సెప్టెంబర్ 21వ తేదీ ఈ వేడుకను కర్నూలులో నిర్వహించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!