నెగిటివిటీని తట్టుకుని సంచలనాలు సృష్టించిన దేవర.. ఈ ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందిగా!

సాధారణంగా పెద్ద సినిమాలకు రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ వస్తే ఆ సినిమా పుంజుకోవడం జరగదు.

అయితే దేవర( Devara ) మాత్రం ఈ విషయంలో ప్రత్యేకం అని చెప్పాలి.

రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చినా దేవర కలెక్షన్లు( Devara Collections ) మాత్రం నెమ్మదిగా పుంజుకున్నాయి.

ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే దేవర సినిమా సంచలనం సృష్టించింది.రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

"""/" / నెగిటివిటీని తట్టుకుని దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.

ఇలా మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాతో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని సక్సెస్ సాధించిన ఘనత తారక్ కే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఎన్టీఆర్ ను( NTR ) ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. """/" / జూనియర్ ఎన్టీఆర్ డైరీ 2028 వరకు ఫుల్ అయిందని తారక్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా సులువైన విషయం అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమాకు ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి.ఆన్ లైన్ బుకింగ్స్ కంటే ఆఫ్ లైన్ బుకింగ్స్ తో దేవర మూవీ అదరగొడుతోంది.

దేవర సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

కల్కి, దేవర సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని పాన్ ఇండియా సినిమాల దిశగా అడుగులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి.

రాబోయే రోజుల్లో తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఎన్టీఆర్ సక్సెస్ రేట్ మరింత పెరిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

సచిన్ కళ్లు చెదిరేలా చేసిన పల్లెటూరి అమ్మాయి బౌలింగ్.. వీడియో చూడాల్సిందే!