ఆ మూవీ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్ కు అటెండ్ అయితే ఆ సినిమా సక్సెస్ సాధించినట్టేనని చాలామంది భావిస్తారు.
తారక్ తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి( Arjun Son Of Vyjayanthi ) ఈవెంట్ కు హాజరు కాగా ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ మా అన్నయ్య ఇప్పటివరకు ఎన్నో గొప్ప సినిమాలు చేశారని అయితే ఈ సినిమా మాత్రం కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.
మనస్సు పెట్టి ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని ఆయన తెలిపారు.ఈ సినిమా క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుందని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
అన్నపై ప్రేమతో తారక్ చేసిన కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ సపోర్ట్ అందించిన నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
"""/" /
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
వార్2, డ్రాగన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కెరీర్ పరంగా తారక్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పారితోషికం విషయంలో తారక్ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.