జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకు.. చంద్రబాబుకు ఉన్న సంబంధం మీకు తెలుసా?

తెలుగు ప్రేక్షకుల నటసార్వభౌముడుగా తెలుగు ప్రజల అన్నగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు అదే పేరుతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.

తాత రూపాన్ని పుట్టుకతోనే సంపాదించుకున్న ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హీరో గా కొనసాగుతున్నారు.

నటనకు ప్రతిరూపంగా.ప్రతి పాత్రకు ప్రాణం పోసే గొప్ప నటుడిగా ఎన్టీఆర్ కొనసాగుతున్నారు.

చూడాలని ఉంది అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించినంత మాస్ ఫాలోయింగ్ మాత్రం రాలేదు.

కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా తో ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇక ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరో ని చేస్తే.

రాజమౌళి కి కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించింది.

ఇప్పటికే ఈ సినిమా రికార్డులు కొన్ని చెక్కు చెదరలేదు. """/" / ఒక రకంగా చెప్పాలంటే సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కేరీర్ ను మలుపు తిప్పింది అని చెప్పాలి.

అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమా కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉంది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

"""/" / సినిమా విడుదలైన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు.

ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో చంద్రబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చారట.ఈ క్రమంలోనే చంద్రబాబు, సినిమాటోగ్రఫీ మంత్రి దేవేందర్  గౌడ్ , దర్శకరత్న దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

ఆ స్థానాల్లో మేమే గెలుస్తాం .. బీఆర్ఎస్ ధీమా వెనుక ..?