Jr Ntr : ఏంటీ.. జూనియర్ ఎన్టీఆర్ ఆ సీరియల్ లో నటించాడా.. బయటపడ్డ అసలు నిజం?
TeluguStop.com
మామూలుగా సీరియల్స్ లో నటించే వాళ్ళు సినిమాలలో.సినిమాల్లో నటించే వాళ్ళు సీరియల్స్ లలో నటించడం సాధారణమైన విషయం.
బుల్లితెరపై అవకాశాలు లేకుంటే వెండితెరపైకి వెళ్తుంటారు.అక్కడ లేకుంటే బుల్లితెరలో సెటిల్ అవుతూ ఉంటారు.
చాలా వరకు చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రమే అలా మారుతూ ఉంటారు.అంతేకానీ స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రం సీరియల్స్ జోలికి వెళ్లరు.
కానీ జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) మాత్రం సీరియల్ లో కూడా నటించాడని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకొని.తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
నటుడుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు.
ఒక నటుడు గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ కు మంచి గౌరవం ఉంది.
మంచి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.ఇక ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు.
అంతేకాకుండా సమాజ సేవలో కూడా పాల్గొంటాడు.ఇక చూడటానికి ఎన్టీఆర్ అలా ఉంటాడు కానీ ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటుంటాడని తనతో నటించిన చాలామంది నటీనటులు చెప్పుకొచ్చారు.
"""/" /
నిజానికి ఎన్టీఆర్ ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్న కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు.
ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టాడు.చిన్నవయసులోనే పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.
అంతేకాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షో లలో వ్యాఖ్యాతగా చేసి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
"""/" /
అయితే ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
అదేంటంటే ఎన్టీఆర్ గతంలో ఒక సీరియల్ లో నటించాడట.ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదని చెప్పాలి.
ఎన్టీఆర్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఈటీవీలో ప్రసారమైన శివ భక్త మార్కండేయ సీరియల్ లో నటించాడట.
ఈటీవీ ప్రారంభమైన కొత్తలో ఈ సీరియల్ ప్రసారమయ్యిందట.అయితే అందులో ఎన్టీఆర్ మార్కండేయ( Markandeya ) పాత్రలో నటించగా ఈ సీరియల్ అప్పట్లో మంచి రేటింగ్ సంపాదించుకుందని తెలిసింది.
"""/" /
ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర( Devara ) అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్టీఆర్.
ఇక దేవర ఎన్టీఆర్ కు ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
రాజకీయ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్… ఏమన్నారంటే?