జూనియర్ మిల్కీ బ్యూటీ ఇక తెలుగు సినిమా ల్లో కనిపించడం అనుమానమే!
TeluguStop.com
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో నాని కి జోడి గా నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్.
ఈ అమ్మడు తెలుగు లో మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ ఇంకా చాలా సినిమాల్లో నటించింది.
కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు సొంతం చేసుకోలేక పోయింది.గత సంవత్సరం వచ్చిన సినిమా తో ఈ అమ్మడి కెరియర్ పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది.
అసలే అవకాశాలు లేవని బాధపడుతున్న ఈ సమయంలో అనూహ్యంగా వరుస ప్లాప్ లు పడడం తో మెహ్రీన్ ఇండస్ట్రీ కి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం ఒకే ఒక్క కన్నడ సినిమా లో నటిస్తోంది.ఆ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో తెలియదు.
కనుక తెలుగు లో ఈమె మళ్లీ వెండి తెర పై కనిపించే అవకాశాలు లేక పోలేదు అని ఇన్నాళ్లు అనుకున్న వారికి నిరాశే ఎదురు కాబోతుంది.
"""/"/
మెహ్రీన్ గతం లో కొన్ని పెద్ద హీరో ల సినిమాల్లో నటించింది.
కానీ అవి ఏవి సక్సెస్ కాక పోవడం తో వరుసగా నిరాశే మిగిలింది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడు అందాల ఆరబోత చేసినా కూడా ఫిలిం మేకర్స్ పట్టించుకోవడం లేదు.
సినిమాల్లో అవకాశాలు రాక పోయినా కూడా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది.
"""/"/అందాల ఆరబోతకు ఫిదా అయినా ఫిలిం మేకర్స్ ఎవరైనా ఈ అమ్మడికి అవకాశం ఇస్తారేమో చూడాలి.
మెహ్రీన్ చూడ్డానికి మిల్కీ బ్యూటీ తమన్నా మాదిరిగా ఉంటుందని కెరీర్ ఆరంభంలో ప్రశంసలు దక్కించుకుంది.
జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్న మెహ్రీన్ పాపం తమన్నా మాదిరిగా చాలా కాలం ఇండస్ట్రీ లో కొనసాగకుండా కొన్నాళ్లకే కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది.
పవన్ కళ్యాణ్ డేట్లను టార్గెట్ చేస్తున్న నితిన్.. హరిహర రాకపోతే అలా జరుగుతుందా?