తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్న జూనియర్‌, రెసిడెంట్ డాక్టర్ల నిర్ణయం.. !!

తెలంగాణలో మరో తలనొప్పి తెచ్చే సమస్య మెదలవుతుంది.అసలే కరోన వైరస్ ఒక్కటే కాకుండా, దీని ఫ్యామిలీ మొత్తం ప్రజల మీద దండయాత్ర ప్రకటించినట్లుగా దాడి చేస్తున్న నేపధ్యంలో హెల్త్ సిబ్బంది గనుక అందుబాటులో లేకుంటే ఎదురయ్యే కష్టాలను ఊహించుకుంటే, ఊహకు కూడా అందవు.

నిజానికి మిగతా శాఖల వారి పని తీరుని కాసేపు పక్కన పెడితే ఈ కోవిడ్ సమయంలో కరోనా పేషంట్లకు దగ్గరగా ఉండి, హై రిస్క్ అని తెలిసి కూడా నిస్వార్దంగా సేవలు అందిస్తున్న డాక్టర్స్, నర్స్ మరియు మిగతా సిబ్బంది గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

ఈ కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినా, ఇంకా సేవలు అందిస్తున్న ఈ సిబ్బంది రుణం ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ ఎంతలా తీర్చుకున్న తక్కువే.

ఇకపోతే జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నారట.

ఈ క్రమంలో అత్యవసర సేవల మినహా, విధులను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుపుతున్నారట.

ఇకపోతే పెంచిన స్టైపండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ స్పందన లేని పక్షంలో 28వ తేదీ నుంచి అన్ని విధులు బహిష్కరించడానికి నిశ్చయించుకున్నారట.

అసలే కరోనా కష్టకాలం ఈ సమయంలో వీరి నిర్ణయానికి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ…. షూటింగ్  ప్రారంభమయ్యేది అప్పుడేనా?