కొన్నిసార్లు పిల్లి కిటికీ నుండి లేదా బాల్కనీ నుండి బయటకు వస్తుంది.ఈ క్రమంలో అమాంతంగా బాగా ఎత్తు నుంచి కిందికి దూకేస్తుంది.
మనం తరుముతున్నప్పుడే కాకుండా పలుమార్లు అది ఎత్తు నుంచి దూకం అలవాటు చేసుకుంటుంది.
మనం చిన్న గోడ మీద నుంచి దూకినా దెబ్బ తగులుతుంది.అయితే అంత ఎత్తు నుంచి దూకినా పిల్లికి ఏమీ కాదు.
అయితే ఎందుకు దెబ్బ తగలదోనని చాలా మందికి సందేహం ఉంటుంది.దీనిని పరిశోధకులు హై-రైజ్ సిండ్రోమ్ అని పిలుస్తారు.
ఎత్తైన అంతస్తుల నుండి పడే పిల్లులు జీవించగలవు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
1987లో ఎత్తైన భవనాల నుండి పడిపోయిన తర్వాత న్యూయార్క్ నగరంలోని అత్యవసర పశువైద్యశాలకు తీసుకువచ్చిన 132 పిల్లులపై ఓ అధ్యయనం జరిగింది.
90 శాతం చికిత్స పొందిన పిల్లులు ప్రాణాలతో బయటపడ్డాయి.37 శాతం మాత్రమే వాటిని సజీవంగా ఉంచడానికి అత్యవసర చికిత్స అవసరమవుతాయని తేలింది.
టెర్మినల్ వేగాన్ని స్వేచ్ఛగా పడే పిల్లి గురుత్వాకర్షణ శక్తిని, గాలి నిరోధకతను ఎదుర్కొనే వేగంగా నిర్వచించబడింది.
పిల్లులు 60 Mph వద్ద టెర్మినల్ వేగాన్ని చేరుకుంటాయి.అయితే మానవులు 120 Mph వరకు అదే వేగాన్ని చేరుకోలేరు.
అలాగే, పిల్లులు వేగాన్ని పెంచుతున్నప్పుడు పసిగట్టగలవు.వేగాన్ని అంచనా వేసుకుని, శరీరాన్ని 180 డిగ్రీల మేర వంచుకుని, తల భాగం పైకి ఉండేలా, కాళ్ల భాగం కిందికి ఉండేలా చూసుకుంటాయి.
పడిపోతున్న క్రమంలో పిల్లులు ఈ ప్రక్రియను వేగంగా చేసేస్తాయి.అంతేకాకుండా వాటి కాళ్లకు అడుగున ఉండే మెత్తని భాగం కూడా వాటికి ఎంతో అనువుగా ఉంటుంది.
కింద పడినా దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
శిల్పాలు చెక్కుతున్న రోబోలు.. శిల్పులకు కూడా గడ్డు కాలం ఎదురయ్యిందా..?