ఈ హోటల్ లో ఏనుగులే నిద్రలేపుతాయి.. కావాలంటే చూడండి!

ఈ హోటల్ చాలా ప్రత్యేకం.ఇందులో చేరే పర్యాటకులను ప్రకృతి అందాలు చూసేందుకు ఉదయమే నిద్రలేపుతారు.

అదేంటి.నిద్రలేపడం కూడా ప్రత్యేకతనా అనుకుంటున్నారా.

మరి కాదా.ఓ గున్న ఏనుగు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపితే ప్రత్యేకత కాక.

మరేంటి.అవును మీరు చదివేది నిజమే.

అది థాయ్ లాండ్ లోని చియాంగ్ మాయ్ లోని ఓ రిసార్టు.ఆ రిసార్టులో ఓ రూము బుక్ చేసుకుని అందులో స్టే చేసింది ఓ యువతి.

రాత్రి నిద్రపోయింది.తెల్లారే లేచి బయటకు వెళ్లాలని అనుకుంది.

పొద్దుపోయినా కానీ నిద్రలేవలేదు.ఆ సమయంలోనే అక్కడికి ఓ గున్న ఏనుగు వచ్చింది.

కిటికీ నుండి తొండాన్ని లోపలికి పెట్టి తనను అలా తాకింది.అలా తాకడంతో నిద్రలో ఉన్న తను ఒక్కసారిగా లేచి కూర్చుంది.

తనను ఎవరు నిద్రలేపిందా అని కిటికీ నుండి చూసే సరికి బయట ఓ గున్న ఏనుగును చూసి ఆశ్చర్యపోయింది.

"""/" / ఆ తర్వాత తనకు తెలిసిందే ఏమిటంటే.ఆ రిసార్టులో స్టే చేసే అతిథులను ఇలానే నిద్రలేపుతాయట ఏనుగులు.

ఈ రిసార్టులో ఉన్నది సాక్షి జైన్.తను ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్.

తననే ఆ గున్న ఏనుగు నిద్రలేపింది.ఇందుకు సంబంధించిన వీడియోను తను జులై 29న ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వీడియో కింద రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.