ఈ వారం రిలీజ్ కానున్న క్రేజీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. కల్కి వల్లే అలా జరిగిందా?
TeluguStop.com
తాజాగా కల్కి సినిమా( Kalki Movie ) విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
అయితే కలికి సినిమా లాంటి పెద్ద సినిమా బరిలో ఉండడంతో చాలా వరకు చిన్న సినిమాలు కూడా థియేటర్లో విడుదల కాలేదు.
మరి ఈ వారం ఎటువంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈవారం థియేటర్లో సందడి చేయడానికి వెబ్ సిరీస్ లు సినిమాలు రెడీగా ఉన్నాయి.
మరి ఆ వివరాల్లోకి వెళితే.సోనియా సింగ్, పవన్ సిద్ధూ జంటగా నటించిన వెబ్‌సిరీస్ శశి మథనం( Shashi Mathanam ).
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు.ఓటీటీ ఈటీవీ విన్ లో గురువారం విడుదలైంది.
"""/" /
మొత్తం ఆరు ఎపిసోడ్‌లు కాగా తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా చూడొచ్చని సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అలాగే మీర్జాపూర్ మూడో సీజన్( Mirzapur ) ఈనెల ఐదు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మూడో సీజన్‌కు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, ఇషా తల్వార్‌లతో పాటు ఈసారి విజయ్ వర్మ కూడా కనిపించనున్నారు.
అదేవిధంగా సుమంత్ హీరోగా ప్రశాంత్ సాగర్ అట్లూరి రూపొందించిన అహం రీబూట్( Aham Reboot ) చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదలైంది.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. """/" /
పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం మార్కెట్ మహాలక్ష్మీ( Market Mahalakshmi ).
ముఖేశ్ దర్శకత్వం వహించారు.హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఏప్రిల్ 18న థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇకపోతే ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.స్ప్రింట్( Sprint ) అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే డెస్పరేట్ లైస్ ( Desperate Lies
)అనే హాలీవుడ్ చిత్రం జులై 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
గోయో( Goyo ) అనే హాలీవుడ్ మూవీ కూడా జులై ఐదు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే.బాబ్ మార్లీ ( Bob Marley )అనే హాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే స్పేస్ కాడెట్ అనే హాలీవుడ్ మూవీ, గరుడన్ తమిళ్ మూవీలు అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు… ఇద్దరూ అంటూ?