జూలై 4 : బ్రిటీష్ పాలన నుంచి విముక్తి.. అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతాయంటే..!!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పెద్దన్నగా వెలుగొందుతున్న అమెరికా కూడా ఒకప్పుడు ‘బానిస’ దేశంగా వుందన్న సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

అప్పట్లో బలంగా వున్న బ్రిటీష్ సామ్రాజ్యపు వలస పాలనలో అమెరికా ఎన్నో కష్టాలను అనుభవించింది.

అయితే ప్రజల్లో వ్యతిరేకత రావడం ప్రారంభం కావడంతో 1760-1770 మధ్య అమెరికన్ కాలనీలు, బ్రిటీష్ పాలకుల మధ్య సంఘర్షణ జరిగి చివరికి అది అమెరికన్ విప్లవానికి దారి తీసింది.

1775 నాటికి ఇది మరింత తీవ్ర రూపు దాల్చింది.ఎన్నో చర్చలు, పోరాటాల అనంతరం 1776 జూలై 4న బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్య్రాన్ని పొందింది.

కాంటినెంటల్ కాంగ్రెస్ (అప్పటి బ్రిటీష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు) బ్రిటన్ చక్రవర్తి కింగ్ జార్జ్‌కు లేఖ రాసింది.

ఆయన ఆమోదంతో జూలై 4న అధికారికంగా అమెరికా స్వాతంత్య్రాన్ని పొందింది.నాటి నుంచి ఏటా జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ వస్తోంది.

వైట్‌హౌస్‌లో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి.ఈ రోజున రోడె ఐలాండ్స్‌లోని బ్రిస్టోల్‌లో భారీ పరేడ్ నిర్వహిస్తారు.

అలాగే 1941 నుంచి ఇండిపెండెన్స్ డే రోజున వేతనంతో కూడిన సెలవును ఇస్తూ వస్తున్నారు.

ఇకపోతే.ఈ రోజున దేశవ్యాప్తంగా కాల్చే బాణాసంచా ప్రత్యేక ఆకర్షణ.

ఇందుకోసం ప్రజలు రూ.1800 కోట్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా.

తొలి నాళ్లలో గంట మోగించడం, మంటలు, భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ ప్రజలు సంబరాలు చేసుకునేవారు.

"""/"/ న్యూయార్క్ నుంచి సీటెల్, చికాగో నుంచి డల్లాస్ వరకు ఈ రోజున ఆకాశం రంగు రంగుల బాణాసంచా పేలుళ్లతో కళకళలాడుతూ వుంటుంది.

అయితే దేశ పశ్చిమ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలు, కార్చిచ్చు సంభవించే ప్రాంతాల్లో మాత్రం బాణా సంచాకు ప్రజలు దూరంగా వుంటారు.

అయితే యాదృచ్ఛికంగా జూలై 4నే ముగ్గురు అమెరికా అధ్యక్షుల వర్థంతి కావడం గమనార్హం.

థామస్ జెఫెర్సన్, జేమ్స్ మన్రో, జాన్ ఆడమ్స్‌లు స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మరణించారు.

అయితే అమెరికా 30వ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ ఈ రోజునే జన్మించడం విశేషం.

కరోనా కల్లోలం నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగడం లేదు.

కానీ ఈసారి పరిస్ధితులు కుదుటపడటంతో ప్రజలు , ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసుకున్నాయి.