అప్పుడు భిక్షాటణ చేసింది.. ఇప్పుడు ఒలింపిక్స్ లో పాల్గొనే స్థాయి.. జులేఖ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
TeluguStop.com
సాధారణంగా చాలామంది జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి.అయితే ఆ కష్టాలను అధిగమించి ముందుకెళ్తే మాత్రమే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆత్మస్థైర్యంతో కష్టపడితే ఏదో ఒకరోజు లక్ష్యాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది.
పెద్ద కలలను కష్టపడి సాధిస్తే ఉన్నత లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు.జులేఖ ( Julekha )సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఒకప్పుడు భిక్షాటన చేసిన ఈ అమ్మాయి తర్వాత రోజుల్లో ఒలింపిక్స్ లో పాల్గొనే స్థాయికి ఎదగడం గమనార్హం.
అనాథశ్రమంలో ( Orphanage )పెరిగిన జులేఖ ఎంతో కష్టపడి వాలీబాల్ నేర్చుకున్నారు.
"""/" /
జులేఖ ఎంతో కష్టపడి అబుదాబి స్పెషల్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ ( Abu Dhabi Special World Summer Games )లో పాల్గొన్నారు.
2019 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో ఆమెకు ఏకంగా కాంస్య పతకం వచ్చింది.
ప్రస్తుతం ఈ పతకం జులేఖకు కొత్త పతకం మాత్రమే కాదు కొత్త జీవితం కొత్త శక్తి కూడా కావడం గమనార్హం.
స్పోర్ట్స్ టీచర్ అశోక రాంచంద్రన్ నాంగ్రా సపోర్ట్ తో జులేఖ వాలీబాల్( Volleyball ) ను నేర్చుకోవడం జరిగింది.
"""/" /
బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించడం వల్ల మొదట్లో హైపర్ గా అనిపించేదని ఆమె తెలిపారు.
నా ఆలోచనలు స్థిరంగా ఉండేవి కావని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని జులేఖ తెలిపారు.
ఏదైనా సాధించి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదల పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
జులేఖ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.జులేఖ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!