Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.

ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు( Nampally Court ) తీర్పును రిజర్వ్ చేసింది.

కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో( Praneeth Rao ) పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు.

అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.

టాలీవుడ్ హీరోల్లో బన్నీని పెళ్లి చేసుకోవాలని ఉంది.. కోవై సరళ కామెంట్స్ వైరల్!