చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో తీర్పు
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మరికాసేపటిలో తీర్పును వెలువరించనుంది.
ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై నిన్నటి విచారణలో చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు ముగియగా ఇవాళ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది.
ఈ క్రమంలో సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు, చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పుతో పాటు రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేయాలా?వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?