అతను అందరూ అనుకునేంత మంచివాడు కాదు.. నిర్మాత కామెంట్స్ వైరల్?

జ్యూడ్‌ ఆంథొని జోసెఫ్‌( Jude Anthony Joseph ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం 2018 ఎవ్రీవన్‌ ఈజ్‌ ఎ హీరో.

ఇటీవల కేరళలో విడుదల అయిన ఈ సినిమా అక్కడ హిట్‌ టాక్‌ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది.

ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జోసెఫ్ తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

కొన్నివిషయాలను అంత ఈజీగా మర్చిపోలేము. """/" / షేన్‌ నిగమ్‌, శ్రీనాథ్‌ బసి( Shane Nigam, Srinath Basi ) లాంటివాళ్లు గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.

కానీ నా దృష్టిలో డ్రగ్స్‌ కన్నా మానవత్వం లేకపోవడమే అతి పెద్ద సమస్య.

ఇండస్ట్రీలో ఆంటోని వర్గీస్‌ అనే వ్యక్తి ఉన్నాడు.అతడు చాలా మంచివాడు అని ని అందరూ అనుకుంటున్నారు.

అందరిలాగే నేను కూడా అతన్ని అలాగే అనుకున్నాను.నిర్మాతగా అతడితో ఒక సినిమా కూడా చేయాలనుకున్నాను.

అందుకు అతడు కూడా ఓకే చెప్పాడు.ఇంతలోనె తన చెల్లెలి పెళ్లి అని చెప్పి సహనిర్మాత, నా స్నేహితుడు అయిన అరవింద్‌ నుంచి రూ.

10 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. """/" / ఇక సినిమా ప్రారంభించడానికి ఇంకా 18 రోజులు ఉంది అనుకున్న సమయంలో అతడు ముఖం చాటేశాడు.

సినిమాను చేయను అని చెప్పడంతో పాటు 10 లక్షలు కూడా ఎగరగొట్టాలని ప్రయత్నం చేశాడు.

అప్పుడు నాకు అరవింద్‌కు చాలా బాధేసింది.ఇద్దరం ఎంతగానో ఏడ్చాము.

మా సినిమా చేయనని చెప్పి నహస్‌ హిదయత్‌ అనే కొత్త దర్శకుడితో అరవం సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఆ సినిమా కొంతకాలానికే ఫ్లాప్ అయ్యింది.బహుశా అతడు చేసిన పాపం అతడికే చుట్టుకుందేమో.

ఆ తరువాత చాలా కాలానికి అతను తీసుకున్న డబ్బును అరవింద్‌కు తిరిగి ఇచ్చాడు.

చాలామంది అర్హత లేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు.అటువంటి వారిలో వర్గీస్‌ ఒకడు.

డైరెక్టర్‌ లిజో జోస్‌ పెల్లిసరీ అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే ఇలాంటి వాళ్లను భరించాల్సిన అవసరమే ఉండేది కాదు అంటూ బాధను వ్యక్తం చేశారు.

తెలుగులో ఐటీ పాఠాలు చెబుతూ కోట్లు సంపాదిస్తున్న శివకుమార్.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!