ఫ్యామిలీతో ఆ దేశానికి వెళ్లనున్న యంగ్ టైగర్.. షూటింగ్ ఆలస్యం కావడంతో?

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుండగా మరో రెండు వారాల తర్వాత ఆర్ఆర్ఆర్ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం మరింత పెంచనున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలయ్యేలోగా ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఎయిర్ పోర్ట్ లో తారక్ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ కూడా పూర్తి కావడంతో తారక్ వెకేషన్ పై దృష్టి పెట్టారని సమాచారం.

జిమ్ లో వర్కౌట్ చేసే సమయంలో ఎన్టీఆర్ కుడిచేతి వేలికి గాయం కాగా వైద్యులు మైనర్ సర్జరీ చేయడంతో ఎన్టీఆర్ ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు.

ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ కు వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తారో చూడాల్సి ఉంది.

"""/"/ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న కొరటాల శివ ఆ సినిమా పనులు పూర్తైన వెంటనే ఈ సినిమాతో బిజీ కానున్నారు.

కొరటాల శివ ఎన్టీఆర్ ను పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నారని సమాచారం. """/"/ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులు పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఈ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా సత్తా చాటాలని ఎన్టీఆర్ భావిస్తుండగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ కెరీర్ విషయంలో, సినిమా స్క్రిప్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!