ఎన్టీఆర్ రాకతో 'బింబిసార' నెక్స్ట్ లెవల్ కు వెళ్లిందా?
TeluguStop.com
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.
దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ విచ్చేసిన విషయం విదితమే.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జులై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా.
"""/"/ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వచ్చి బింబిసార టీమ్ ను మరింత ఉత్సాహ పరిచాడు తారక్.
ఒకే వేదికపైకి నందమూరి అన్నదమ్ములు కనిపించి నందమూరి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేసారు.
ఈ వేడుకకు తారక్ విచ్చేసి ఈ టీమ్ కు మరింత బూస్ట్ ఇవ్వడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది.
తారక్ చాలా రోజుల తర్వాత బయట కనిపించడంతో మరింత క్రేజ్ వచ్చేసింది.దీంతో ఇప్పుడు అంతా కూడా బింబిసార గురించి మాట్లాడు కుంటున్నారు.
తారక్ రాకతో బింబిసార సినిమాకు ఫుల్ మైలేజ్ వచ్చిందనే చెప్పాలి.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో.
అమెరికా: భారతీయుల జీవితాలు అల్లకల్లోలం.. వీసాల గందరగోళంతో ఆందోళన.. అసలేం జరుగుతోంది?