ఆ ఫోటోగ్రాఫర్ల మీద అరిచేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కోపానికి కారణాలు ఇవేనా?

టాలీవుడ్ హీరోయిన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

"""/" / ఈ సినిమాను కోట్ల బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇకపోతే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.

కాగా ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో( War 2 ) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు తారక్.అంతేకాకుండా దేవర గెటప్ నుంచి వార్ 2 లుక్‌లోకి మారిపోయాడు.

దేవర సినిమాకు ఎన్టీఆర్ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించేవాడు.కానీ వార్ 2 కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లోకి మారిపోయాడు.

"""/" / ఇప్పటికే ఆ లుక్ కి సంబంధించిన ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా మరోసారి తారక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ముంబైకి ( Mumbai ) వెళ్లాడు ఎన్టీఆర్.హోటల్‌కి ఎన్టీఆర్ వెళ్తున్నా కూడా అక్కడి కెమెరామెన్లు షూట్ చేస్తూనే ఉన్నారట.

దీంతో ఎన్టీఆర్ వారి మీద కాస్త ఫైర్ అయినట్టుగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

షాకింగ్ వీడియో: చిరుతిళ్లు తింటుండగా బాలికలకు షాకింగ్ అనుభవం.. ఒక్కసారిగా..