తాతగారిని నిలదీద్దామని అనుకున్న ఎన్టీఆర్.. ఏమైందంటే..?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమనే సంగతి తెలిసిందే.
బాల్యంలో తాతకు దూరంగా పెరిగిన జూనియర్ ఎన్టీఆర్ తరువాత కాలంలో తాతకు దగ్గరయ్యారు.
తాత రూపంతో పాటు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా సత్తా చాటుతున్నారు.
తాతగారి రూపంతో ఉండటం గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అలా పుట్టడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు.
తాత రూపం రావడం గురించి చాలాసార్లు థింక్ చేసేవాడినని ఒక సందర్భంలో తాతను ఆ రూపం గురించి అడుగుదామని అనుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు.
ఆ రూపం రావడానికి తన దగ్గర కూడా సరైన సమాధానం లేదని ఎన్టీఆర్ వెల్లడించారు.
తాత పేరును తాను బాధ్యతగా భావిస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తాత పేరుతో లైఫ్ ఏ విధంగా మొదలైందో అదే విధంగా ముగుస్తుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
తాత అంటే తనకు ఎంతో ఇష్టమని తాత పేరును తలచుకోకపోతే తనకు ముద్ద కూడా దిగదని ఎన్టీఆర్ వెల్లడించారు.
"""/"/ చిన్నప్పుడు తాను అల్లరి చేసేవాడినని అమ్మ చేతిలో దెబ్బలు కూడా తిన్నానని ఎన్టీఆర్ తెలిపారు.
అయితే కొట్టిన తరువాత తల్లి ఎంతో దగ్గరకు తీసుకునేదని ప్రేమతో గాయాలకు మందు రాసేదని ఎన్టీఆర్ వెల్లడించారు.
బాల్యంలోనే దాదాపు 12 డ్యాన్సులు నేర్చుకున్నానని ఎన్టీఆర్ అన్నారు.ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలొ ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
"""/"/ ఈరోజు విడుదలైన ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు సైతం వెలువడ్డాయి.కొరటాల శివ సినిమా లుక్ కూడా రిలీజ్ కాగా ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏ విధంగా కనిపించబోతున్నారో తెలుస్తోంది.
వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు