ఆ వ్యక్తి టాలెంట్ ను ఎవరూ సరిగ్గా వాడుకోలేదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.
( Devara ) జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
రోజు రోజుకి విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్ ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతున్నారు.
మరోవైపు ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేశారు. """/" /
ప్రస్తుతం ఎన్టీఆర్ అలాగే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) మూవీ మేకర్స్ ని ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేవర సినిమాలో బైర పాత్ర ఎంతో కీలకం.ఆ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించింది.
ఓంకార సినిమాలో( Omkaara Movie ) ఆయన యాక్టింగ్ అద్భుతం. """/" /
సైఫ్ టాలెంట్‌ను ఇప్పటివరకూ ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని నా భావన అని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.
ఈమెరకు తారక్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
తారక్ అభిమానులతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం