జూనియర్ ఎన్టీఆర్ ను బాగా ఇబ్బందిపెట్టేస్తున్నారే ?

రాజకీయాలకు ఎంత దూరంగా ఉందామన్నా జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు కుదరడం లేదు.

గతంలో టీడీపీ తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి దిగినా ఆ తరువాత సినిమాల మీదే దృష్టిపెట్టి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల్లో ఎన్టీఆర్ సోదరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినా జూనియర్ మాత్రం ప్రచారానికి వెళ్ళలేదు సరికదా బహిరంగంగా మద్దతు కూడా తెలపలేదు.

కేవలం శుభాకాంక్షలు చెప్పి ఊరుకున్నాడు.ఇప్పుడు స్వయానా తనకు పిల్లనిచ్చిన మామ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎమ్యెల్యేగా పోటీ చేయబోతున్నారు అనే వార్తలతో జూనియర్ ఇరకాల్లో పడ్డాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2009లో టీడీపీ తరపున ప్రచారానికి దిగిన జూనియర్ ఆ తర్వాత చంద్రబాబుకు అప్పట్లో హరికృష్ణకు వివాదం రావడంతో జూనియర్ సై లెంట్ అయిపోయారు.

ఇక, 2014లో ప్రచారానికి దూరంగా ఉన్నాడు.అప్పుడు పవన్‌ను తన ప్రచారానికి వాడుకున్నాడు చంద్రబాబు.

ఇక, ఇప్పుడు ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం సిద్ధమైంది.దీంతో ఇప్పుడు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రచారంపై చర్చ తెరమీదికి వచ్చింది.

గుంటూరులోని చిలకలూరిపేట, లేదా పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

అయితే, ఇప్పుడు తన సొంత మామ విజయాన్ని కాంక్షిస్తూ.జూనియర్ ప్రచారం చేస్తారా అనే విషయం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక వైసీపీ కూడా జూనియర్ ను ఎన్నికల ప్రచారానికి దించాల్సిందిగా నార్నె మీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలుసురుతోంది.

రాష్ట్రమంతా ప్రచారం చేయకపోయినా కనీసం నార్నెశ్రీనివాసరావు కు సీటు ఇచ్చిన చోట ఎన్టీఆర్ తో ప్రచారం చేయించాల్సిందిగా నార్నె మీద ఒత్తిడి తెస్తున్నారు.

ఈ విషయాలపై జూనియర్ చాలా సందిగ్ధం లో పడినట్టు తెలుస్తోంది.పిల్లనిచ్చిన మామ ఒకవైపు, తన తాత స్థాపించిన పార్టీ ఒకవైపు ఉండడంతో ఎటూ ముందడుగు వేయలేని పరిస్థితి ఎన్టీఆర్ ఎదుర్కొంటున్నాడు.

అందుకే ఎవరికీ మద్దతు తెలపకుండా దూరంగా ఉంటేనే బెటర్ అన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు