జూనియర్ ఎన్టీఆర్.. ఎన్ని సినిమా షూటింగుల్లో గాయపడ్డాడో తెలుసా?

సినిమా షూటింగ్ సమయంలో చిన్న చిన్న దెబ్బలు తగలడం కామన్.ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి.

అయితే చిన్న చిన్న గాయాలు అయితే ఫర్వాలేదు కానీ.తీవ్ర గాయాలై పరిస్థితి ప్రాణాల మీదకు వస్తేనే ఇబ్బంది అవుతుంది.

అలాంటి చాలా సంఘటనలు టాలీవుడ్ లో ఉన్నాయి కూడా.మిగతా హీరోలతో పోల్చితే జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమా షూటింగుల్లో గాయపడ్డాడు.

పెద్ద దెబ్బలు తగిలిన సందర్భం కూడా ఉంది.ఇంతకీ ఆయన గాయపడిన సినిమా షూటింగులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

*జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు.

కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు.*వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాలోనూ ఎన్టీఆర్ గాయపడ్డాడు.

భారీ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు మోచేతికి తీవ్ర గాయం అయ్యింది.అయితే మోచేతికి కట్టుకట్టుకునే ఓ పాట చేశాడు ఎన్టీఆర్.

"""/"/ *రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా సింహాద్రి.ఈ సినిమాలో క్లైమాక్స్ లో కూడా ఎన్టీఆర్ గాయపడ్డాడు.

అయినా షూటింగ్ లో పాల్గొన్నాడు. """/"/ *అటు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబ సినిమాలో 40 మంది ఫైటర్లతో యాక్షన్ సీన్స్ చేశాడు ఎన్టీఆర్.

ఈ సమయంలోనూ ఆయన గాయపడ్డాడు. """/"/ *రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో రెండు సార్లు గాయపడ్డాడు.

రోప్ కట్టుకున్నప్పుడు ఒకసారి.ఫాట షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు.

"""/"/ *వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాలోనూ గాయపడ్డాడు.క్లైమాక్స్ తీస్తున్నప్పుడు ఆయనకు గాయాలు అయ్యాయి.

"""/"/ *సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఊసరవెల్లి సినిమాలోనూ గాయపడ్డడాడు.ఎమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు చిన్నచిన్న గాయాలు అయ్యాయి.

"""/"/ *మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమాలో ఎన్టీఆర్ కు చాలా సివియర్ గాయాలు అయ్యాయి.

కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్నాడు కూడా. """/"/ *తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ లోనూ గాయపడ్డాడు.

భారీ యాక్షన్ సీన్స్ సందర్భంగా ఆయనకు దెబ్బలు తగిలాయి. """/"/.

జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. 2025 బాక్సాఫీస్ పోరులో గెలుపెవరిదో?