జపాన్ లో తారక్ క్రేజ్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.ఈ సినిమా విడుదల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది.

అంతేకాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు జూనియర్ ఎన్టీఆర్.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.కాగా ఎన్టీఆర్ అభిమానులకు ఆయన పేరు చెబితే పూనకాలు వస్తాయి అని చెప్పవచ్చు.

అయితే ఎన్టీఆర్ కి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ కి వెళ్ళాడు.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన కొంత మంది అభిమానులు ఆశ్చర్యపోగా మరికొందరు మాత్రం ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

"""/"/ ఆ తర్వాత అక్కడి వారందరితో ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు జూనియర్ ఎన్టీఆర్.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నేడు అనగా అక్టోబర్ 21న జపాన్ లో విడుదల అయింది.

మరి ప్రపంచవ్యాప్తంగా భారీ హీట్ ను అందుకున్న ఈ సినిమా జపాన్ లో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?