Junior NTR : అయోధ్యకు తారక్, ప్రభాస్ వెళ్లకపోవడానికి అసలు కారణాలు ఇవేనా.. ఏం జరిగిందంటే?

తాజాగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు పెద్దపెద్ద సెలబ్రిటీలు హాజరు అయ్యారు.చాలా ప్రదేశాలలో లైవ్ టీవీ ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇక నిన్నటి రోజున అయోధ్యకు టాలీవుడ్ బాలీవుడ్ అలాగే కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.

రజినీకాంత్, మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, ధనుష్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంకా చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినప్పటికీ కొన్ని కొన్ని కారణాల వల్ల అయోధ్యకు వెళ్ళ లేకపోయారు.

"""/" / అటువంటి వారిలో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా ఒకరు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా అయోధ్యకు హాజరు కాలేదు అన్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

దేవర సినిమా( Devara Movie ) విషయంలో మేజర్‌ షెడ్యూల్‌ను ముందుగానే చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిందట అందుకోసం సైఫ్‌ అలీఖాన్‌తో ముఖ్యమైన భారీ యాక్షన్‌ సీన్‌ను ప్లాన్‌ చేశారట.

కొన్ని వందల మంది ఈ సినిమా షూటింగ్‌లో రోజూ పాల్గొంటున్నారట.తారక్‌ పాల్గొనే సీన్‌ కోసం భారీ సెట్‌ కూడా నిర్మించారట.

తన వల్ల షూటింగ్‌ ఆగిపోతే నిర్మాతకు ఇబ్బంది కలుగుతుందని ఆయన భావించారట.దీంతో ఆయోధ్యకు ఆయన వెళ్లలేక పోయారని టాక్‌ నడుస్తోంది.

"""/" / ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్‌ అలీఖాన్‌( Saif Ali Khan ) గాయం కారణంగా ఆస్పత్రిలో చేరడం.

ఈ సమాచారం కూడా దేవర యూనిట్‌కు ఆలస్యంగా తెలువడంతో చివరి నిమిషంలో తారక్‌ అయోధ్య ట్రిప్‌ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్‌తో పాటు తారక్‌ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా షూటింగ్లో వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!