దేవర సినిమా నుంచి అదిరిపోయే లీక్.. ఆ ఫైట్ సీన్ వేరే లెవెల్ లో ఉండనుందా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా( Devara Movie )లు నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

ఈ పాన్ ఇండియా మూవీ చివరి దశకు చేరుకుంది.కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.

కొరటాల శివ( Koratala Siva) కంప్లీట్ గా తన రెగ్యులర్ ఫార్ములాని పక్కనపెట్టి ఫిక్షనల్ స్టోరీ లైన్ తో దేవర మూవీ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నంలో కొరటాల ఉన్నారు.రీసెంట్ గా దేవర టైటిల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీనికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా వినిపిస్తోందీ.

దేవర మూవీ స్టోరీ లీక్ అంటూ ఒక వీడియో హల్చల్ చేస్తోంది.ఈ వీడియో కారణంగా ఇంట్రస్టింగ్ టాక్ ట్రెండ్ అవుతోంది.

"""/" / దేవర మూవీలో తారక్ ఒక పది గ్రామాలకు కాపరిగా ఉంటాడంట.

ఆ 10 గ్రామాలను రక్షించే బాధ్యతను దేవర తీసుకుంటాడట.వారిని కాపాడటానికి వందలాది మంది మానవ రూపంలో ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తారని, సముద్ర తీరంలో వందలాది మంది రౌడీ మూకలతో దేవర ఒంటరిగా చేసే ఫైట్ సీక్వెన్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమా కథ ఎలా ఉంటుందనే విషయంలో ఒక హింట్ అయితే ఇచ్చేసారు.

దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా కథ ఇదే అంటూ ప్రచారం కూడా నడుస్తోంది.

అయితే ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ పెదనాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!