తాత బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది నటులు నందమూరి కుటుంబం నుండి పరిచయమయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు కానీ, పాటలు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో వాడుతుంటారు.

అంతేకాకుండా ఆయనలా మాట్లాడటం, ఆయనలా గెటప్ లు వేయడం కూడా జూనియర్ ఎన్టీఆర్ కు బాగా సెట్ అవుతుంది.

ఇదిలా ఉంటే మరో సారి జూనియర్ ఎన్టీఆర్ తన తాత బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ తో ఓ సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఇందులో ఎన్టీఆర్ నటన కోసం నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ఈ సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

"""/"/ ఇక వీటితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

అంతే కాకుండా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

పొలిటికల్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తుంది. """/"/ ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఏంటని అభిమానులు కూడా ఎదురు చూశారు.

దాంతో తాజాగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ను పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న సినిమా 'వేటగాడు'.

ఇక ఈ సినిమా పేరు ప్రస్తుతం జోరుగా వినిపించడంతో పాటు.ఈ టైటిల్ కొరటాల రాసుకున్న కథకు బాగా సెట్ అవుతుందని.

అందుకే ఈ టైటిల్ ను పెట్టడానికి ప్రచారాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నాలుగో అనుమానితుడు