ఆ హీరోయిన్ ని అందుకే చెప్పుతో కొట్టానంటున్న రాకేష్ మాస్టర్…
TeluguStop.com
ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నిత్యం ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఇందులోభాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీరెడ్డి, తదితరులపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా రాకేష్ మాస్టర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా తన సినీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో తాను అప్పట్లో ఓ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో ఓ హీరోయిన్ సినిమా షూటింగులకు ఉపయోగించే కెమెరాని కాలితో తన్నిందని అందువల్ల తన చెప్పుతో ఆమెను కొట్టానని తెలిపాడు.
అయితే సినిమా పరిశ్రమలో కెమెరా అనేది తమకు కన్నతల్లి వంటిదని, కెమెరా లేకపోతే తాము లేమని అటువంటి కెమెరాని అలా దారుణంగా అవమానించడంతో చెప్పుతో కొట్టాల్సి వచ్చిందని కూడా తెలిపాడు.
రాకేష్ మాస్టర్ తెలిపినటువంటి ఈ విషయాన్ని ఒక్కసారిగా నెటిజన్లను ట్రోల్ చేస్తున్నారు.అయితే ఒకప్పుడు తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసినటువంటి కొందరు ఇప్పుడు డైరెక్టర్లుగా ఎదిగారని అయితే ఇందులో కొందరు ఇప్పటికీ తనతో సన్నిహితంగా ఉంటున్నారని కానీ మరికొందరు మాత్రం తన ముందరే లెవెల్ చూపిస్తున్నారని అలాంటి వారిని నేను లెక్క చేయనని తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొందరు అభిమానులు రాకేష్ మాస్టర్ కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని హైదరాబాద్ నగరంలోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?