ఫేస్ బుక్ మోసాలపై అమ్మాయిలకి జాగ్రత్త చెబుతున్న ఎన్ఠీఆర్

సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక చాలా మంది ఫేక్ ప్రొఫైల్ తో అమ్మాయిలని ట్రాప్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు.

అవతలి వారు ఎలాంటి వారో తెలుసుకోకుండా అమ్మాయిలు కూడా శృతి మించి చాటింగ్ లు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.

ఏదో ఒక సమయంలో వారి ట్రాప్ లో పడి తరువాత వారి వేధింపులని భరించలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.

కొంత మంది వారి ఉచ్చులో పడి అడిగినంత డబ్బులు ఇస్తూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.

కొంత మంది అమ్మాయిలు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.అయితే ఇలాంటి సైబర్ ప్రేమికుల ఉచ్చులో పడకూడదని పోలీసులు ఎన్ని సార్లు చెప్పిన కూడా ఇంకా ఎక్కడో ఓ చోట అలాంటి సైబర్ వేధింపులకి అమ్మాయిలు గురవుతూనే ఉన్నారు.

తెలంగాణ పోలీసులు అమ్మాయిలని అలెర్ట్ చేయడానికి సైబర్ నేరగాళ్ల నుంచి తమని తాము కాపాడుకోమని చెప్పడానికి జూనియర్ ఎన్ఠీఆర్ సాయం తీసుకున్నారు.

"""/"/ ఇలాంటి సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలలో ముందుండే తారక్ తెలంగాణ పోలీసులకి ప్రచారకర్తగా మారారు.

తాజాగా ఎన్ఠీఆర్ కి సంబంధించి ఒక వీడియోని వారు రిలీజ్ చేశారు.పేస్ బుక్ లో అజ్ఞాత ప్రేమికుడి మాయలో పడిన ఒక అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని అందులో చూపించి ఫైనల్ గా అలాంటి మోసాలకు, వేధింపులకి గురయ్యే అమ్మాయిలు ధైర్యంగా పోలీసులకి ఫిర్యాదు చేయాలని ఆ వీడియోలో ఎన్ఠీఆర్ తో చెప్పించారు.

స్టార్ హీరో ఇలా వచ్చి సైబర్ వేధింపులపై గొంతు విప్పడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అయ్యింది.

నందమూరి ఫ్యాన్స్ తో పాటు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఈ వీడియో ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!